
క్రీడలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధి, సర్వజన సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలు రాజకీయ ఉద్దేశాలతో కూడినవని, అవి మూర్ఖత్వానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని, పాలనలో విఫలమవుతోందని మల్లు రవి ఆరోపించారు. నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన “ఫ్లాప్ షో”గా ముగిసిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవ్వరూ ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆయన స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!