
సినిమాలు

తెలంగాణ సచివాలయంలో కొత్తగా అమలు చేసిన QR కోడ్ ఆధారిత ప్రవేశ విధానంలో ప్రారంభమైన 24 గంటల్లోనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వినియోగదారులకు OTPలు అందకపోవడంతో QR కోడ్ రూపొందించడంలో ఇబ్బందులు ఏర్పడి, ప్రవేశ ప్రక్రియకు అంతరాయం కలిగింది.
ఈ సమస్య నేపథ్యంలో ప్రభుత్వం QR కోడ్ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేసింది. సాంకేతిక లోపాలను వెంటనే పరిష్కరించాలని మీ సేవ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు SPF కూడా QR కోడ్ ధృవీకరణ ప్రక్రియను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!