
క్రీడలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీవీ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు క్రమంగా కనుమరుగవుతూ కొత్త నాయకుల ఆధిపత్యం పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వంలో “షో ఆఫ్ పాలిటిక్స్” ఎక్కువగా ఉందని, ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలు సరైనవికావని ఆయన విమర్శించారు. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు నియామకాలపై తనకు సమాచారం ఇవ్వకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ సభకు హాజరుకాకపోవడానికి ఇదే కారణమని చెప్పారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ కలకలం రేపాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!