

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఖరారయ్యారు. ఈరోజు కోల్‌కతాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో సువేందు అధికారిని ముఖ్యమంత్రి పదవికి ఎన్నుకున్నారు. రేపు కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను కూడా నియమించనున్నట్లు సమాచారం.
సీఎంగా సువేందు అధికారిని బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆయనను తమ నేతగా ఎన్నుకున్నారు. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. బెంగాల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుండగా, సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న సువేందు అధికారి చరిత్ర సృష్టించనున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీను సువేందు అధికారి భవానీపూర్ నియోజకవర్గంలో ఓడించారు. 2021 ఎన్నికల్లో కూడా నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 294 స్థానాలకు గానూ 207 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కేవలం 80 సీట్లకే పరిమితమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!