
సినిమాలు

పార్టీ మార్పుపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కోసమో, డబ్బుల కోసమో తాను పార్టీ మారలేదని స్పష్టం చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఇష్టం లేదని, అయితే పరిస్థితుల కారణంగా తప్పలేదని పేర్కొన్నారు.
పార్టీ మారిన తర్వాత ఆరు నెలల్లో పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ సగం నిధులు మాత్రమే విడుదల చేశారని పోచారం ఆరోపించారు. నిధుల కోసం అడిగేందుకు సీఎం, మంత్రులకు ఫోన్లు చేసినా వారు స్పందించడం లేదని అన్నారు. తాను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని, కాంగ్రెస్ జెండాను కాదని పోచారం వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!