

సీఎల్పీలో నిర్వహించిన చిట్‌చాట్‌లో తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలపై స్పందించారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడమే కేటీఆర్ విధానంగా కనిపిస్తోందని, పెట్టుబడిదారులను బెదిరించడం వారి పద్ధతిగా మారిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి సోదరుడు సమావేశంలో పాల్గొన్నందుకే టెండర్ల ప్రక్రియ ప్రభావితమైందంటూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు సత్యదూరమని అన్నారు. తన శాఖకు సంబంధించిన అన్ని అంశాలు తన దృష్టిలో ఉంటాయని, నిబంధనల ప్రకారమే చట్టబద్ధంగా టెండర్లు నిర్వహించామని స్పష్టం చేశారు.
టెండర్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ఫ్రీ బిడ్‌లో ఏడుగురు ప్రమోటర్లు పాల్గొన్నారని శ్రీధర్‌బాబు తెలిపారు. ఎక్కడా లోపభూయిష్టత లేదా మార్పులు జరగలేదని పేర్కొన్నారు. టెసరాట్ సంస్థకు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం లేదని, సంస్థ బోర్డులో కూడా వారు అధికారికంగా లేరని స్పష్టం చేశారు. రికార్డుల ప్రకారం బోర్డులో నలుగురు డైరెక్టర్లు ఉన్నారని తెలిపారు. సంస్థకు అవసరమైన అనుమతులు, రిజిస్ట్రేషన్లు ఉన్నాయని, భూమికి సంబంధించిన చెల్లింపులు కూడా చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా ఆధారంగా కేటీఆర్ గాలిలో లెక్కలు కడుతూ ప్రచారం చేస్తున్నారని శ్రీధర్‌బాబు విమర్శించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!