

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద మంచి జోరు కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 24న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్లపై మాత్రం పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. రెండు రోజుల్లోనే సినిమా రూ.100 కోట్ల మార్క్‌కు చేరువైనట్లు ట్రేడ్ వర్గాల గణాంకాలు వెల్లడించగా, మూడో రోజు కూడా కలెక్షన్లు కొనసాగాయి.
మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘ది ప్యారడైజ్’ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.136 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే స్వతంత్ర ట్రేడ్ ట్రాకర్ల లెక్కల ప్రకారం మూడో రోజు వరకు ప్రపంచవ్యాప్త గ్రాస్ సుమారు రూ.119.5 కోట్లుగా ఉంది. నాని నటన, శ్రీకాంత్ ఓదెల టేకింగ్, అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. కథ, కథనంపై మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ వీకెండ్ కారణంగా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!