

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. సెప్టెంబర్ 29న నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, పల్లె పండుగ 3.0 కింద రూ.11,085 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో సీసీ, బీటీ రోడ్లు, పశువుల షెడ్లు, ఉద్యానవనాలు, డ్రైనేజీలు, బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు తదితర మౌలిక వసతుల పనులు ఉన్నాయి.
ఈ దశలో సుమారు 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 22,000 మినీ గోకులాలు, 50,000 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి, 1,000 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం వంటి పనులకు ప్రణాళిక రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. పల్లె పండుగ తొలి రెండు దశల్లోనూ గ్రామీణ రహదారులు, పశువుల షెడ్లు, వ్యవసాయ కుంటలు, డ్రైనేజీ తదితర పనులు చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పల్లె పండుగ 3.0 ప్రారంభ కార్యక్రమానికి సంబంధించి రామాపురంలో వేదిక, రాకపోకలు, పార్కింగ్, భద్రత, తాగునీరు తదితర ఏర్పాట్లను అధికారులు సమీక్షిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!