

సినీ ప్రియులకు ఈ వీకెండ్ ఓటీటీ వినోదాల విందు సిద్ధమైంది. థియేటర్లలో పెద్ద సినిమాల రన్ ముగియడంతో పాటు కొత్త డిజిటల్ కంటెంట్ అందుబాటులోకి రావడంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో సందడి చేస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అల్లరి నరేశ్ నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ స్ట్రీమింగ్ అవుతోంది. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సురభి, రాశిసింగ్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే ‘మేన్షన్ హౌస్ మల్లేష్’, ‘ది లవ్ హైపోథెసిస్’, తమిళ చిత్రం ‘ఫొటోగ్రాఫర్’, హిందీ డబ్బింగ్ చిత్రం ‘డోంట్ బి షై’ అందుబాటులో ఉన్నాయి. ‘ది డెత్ ఆఫ్ రాబిన్‌హుడ్’ రెంట్ విధానంలో వీక్షించేందుకు సిద్ధంగా ఉంది.
జీ5లో ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో శ్రవణ్ రెడ్డి, కామాక్షి భాస్కర్ల నటించిన మిస్టిక్ థ్రిల్లర్ ‘అగధ’ స్ట్రీమింగ్ అవుతోంది. కవిన్, నయనతార, సుహాసిని నటించిన ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా ‘హాయ్’, హిందీ సిరీస్ ‘బకైతి 2’ కూడా అందుబాటులోకి వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌లో హ్యూమా ఖురేషీ నటించిన ‘బేబీ డూ ఆర్ డై’, తెలుగు డబ్బింగ్‌లో ‘షక్: ట్రస్ట్ నో వన్’, ‘యునాబాంబర్’, ‘వోంకాస్ ది గోల్డెన్ టికెట్’ వంటి కంటెంట్ స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌స్టార్‌లో ‘హుంకార్: ది రోర్’, ‘మాంగో పచ్చ’, ‘టాయ్ స్టోరీ 5’ ఉండగా.. సోనీలివ్‌లో ‘హబీబీ’ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ వారాంతంలో వివిధ జానర్లలో ప్రేక్షకులకు పలు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!