

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. నిరుపేదలు, అణగారిన వర్గాలకు జీవనాధారంగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు గత 11 ఏళ్లుగా నిరంతరం చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
కరోనా వంటి సంక్షోభ కాలంలో పేదలకు సంజీవనిలా పనిచేసిన ఈ పథకాన్ని ఎవరినీ సంప్రదించకుండా, విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా మార్చేశారని సోనియా గాంధీ అన్నారు. పథకం పేరు నుంచి ‘మహాత్మా గాంధీ’ పేరును తొలగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కొత్త మార్పులతో గ్రామ పంచాయతీల అధికారాలు తగ్గి, ఢిల్లీ నుంచే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది పేదల ఉపాధి హక్కును కాపాడేందుకు ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడతామని ఆమె స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!