
జనరల్

అయోధ్య రామాలయ విరాళాల చోరీ ఆరోపణలు, విద్యార్థులపై జరిగినట్లు ఆరోపిస్తున్న దాడులను నిరసిస్తూ విపక్ష ఎంపీలు సోమవారం పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈ రెండు అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.
నిరసన సందర్భంగా "చందా చోర్ గద్దె చోడ్", "అమిత్ షా సదన్ మే ఆవ్", "అమిత్ షా గయబ్ హై" అంటూ విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తో పాటు ఇతర విపక్ష పార్టీల ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ, కే.సి. వేణుగోపాల్ పాల్గొనగా, తెలంగాణ నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, అనిల్ కుమార్ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!