

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గల్ఫ్ ప్రాంతంలో జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై అమెరికా స్పందించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామి అయిన అమెరికా, అమాయక భారతీయుల ప్రాణనష్టంపై కనీసం విచారం లేదా సంతాపం వ్యక్తం చేయకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిలో నిబంధనల అమలు పేరుతో చేపడుతున్న చర్యలపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.
నౌకలను నిలిపివేయడానికి ప్రాణహాని కలగని ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా, ప్రాణనష్టం జరిగే విధంగా చర్యలు ఎందుకు తీసుకుంటున్నారని థరూర్ ప్రశ్నించారు. గల్ఫ్ ప్రాంతంలో ప్రయాణించే అనేక వాణిజ్య నౌకల్లో భారతీయ సిబ్బంది పనిచేస్తున్నారని, వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ఘటనపై భారత్ ఇప్పటికే తన ఆందోళనను వ్యక్తం చేయగా, అంతర్జాతీయ జలాల్లో పనిచేసే పౌర నావికుల భద్రతను కాపాడాల్సిన అవసరాన్ని మరోసారి నొక్కిచెప్పింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!