
జనరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడను ఫోన్లో పరామర్శించారు. దేవెగౌడ సతీమణి చెన్నమ్మ ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆమె మృతిపట్ల సీఎం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో దేవెగౌడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఈ విషాదాన్ని ఎదుర్కోవాలని ఆకాంక్షించారు.
చెన్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన ముఖ్యమంత్రి, దేవెగౌడతో పాటు ఆయన కుటుంబంతో తనకు మూడు దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో తాము అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!