

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సోలో హీరోగా తన సినీ ప్రయాణంలో పదేళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్నారు. 2016లో విడుదలైన ‘పెళ్లి చూపులు’ సినిమాతో ప్రధాన కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్, తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా, ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్‌డమ్ వంటి చిత్రాలతో స్టార్‌డమ్‌ను మరింత బలోపేతం చేసుకున్నారు. అలాగే ‘కల్కి’ చిత్రంలో అర్జునుడిగా ప్రత్యేక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి పాన్-ఇండియా స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతోమంది యువ నటులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ విజయ్ దేవరకొండ తన ప్రత్యేకతను చాటుతున్నారు. ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు, మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందిస్తూ, ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించారు. ప్రస్తుతం ‘రౌడీ జనార్ధన్’, ‘రణబాలి’, అలాగే దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూడు ప్రాజెక్టులు విజయ్ కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!