
జనరల్

మెగా డీఎస్సీ-2025 నియామకాల ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేస్తూ, నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సీబీఐతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోర్టును కోరారు. పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటా అమలు, మెరిట్ జాబితా తయారీ వంటి అంశాలపై విచారణ అవసరమని పిల్‌లో పేర్కొన్నారు.
అదే విధంగా, డీఎస్సీ-2025కు సంబంధించిన అన్ని డిజిటల్ రికార్డులు, సర్వర్లు, ఫైళ్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపి పారదర్శకతను నిర్ధారించాలని పిటిషనర్ కోరగా, ఈ పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!