

బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే కనిపించనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ఎ.ఆర్. రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రామాయణ’ రెండు భాగాల ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టీ-సిరీస్ సుమారు రూ.75 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. విడుదలకు ముందే ఇంత భారీ డీల్ కుదరడం సినిమాపై ఉన్న భారీ అంచనాలను స్పష్టం చేస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే బిజినెస్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!