

టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఎయిర్ ఇండియా పూర్తిస్థాయి పునరుద్ధరణకు మరో 5 నుంచి 10 సంవత్సరాలు పట్టవచ్చని తెలిపారు. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను తిరిగి స్వాధీనం చేసుకున్న సమయంలో, ఐదేళ్లలో సంస్థను పునర్వ్యవస్థీకరించి లాభాల బాట పట్టించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు ఊహించిన దానికంటే క్లిష్టంగా ఉండటంతో ఆ ప్రక్రియ మరింత సమయం తీసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
పరిశ్రమ వర్గాల ప్రకారం, కొత్తగా ఆర్డర్ చేసిన విమానాల డెలివరీ ఆలస్యం, పాత విమానాలకు అవసరమైన స్పేర్ పార్ట్‌ల కొరత, విమాన ఇంధన ధరల పెరుగుదల, పాత విమానాలను ఆధునిక సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం వంటి అంశాలు ఎయిర్ ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోకి వచ్చి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు పూర్తయినా సంస్థ ఇంకా భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.22,238 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయడం సంస్థ పునరుద్ధరణ ఇంకా సుదీర్ఘ ప్రయాణమేనని సూచిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!