

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. మార్కెట్ విలువలో ఎన్విడియాను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా అవతరించింది. ఇదే సమయంలో తొలిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.477 లక్షల కోట్లు) మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను తాకి మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ స్థాయిని చేరుకున్న ప్రపంచంలోని రెండో కంపెనీగా యాపిల్ చరిత్ర సృష్టించింది.
మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో యాపిల్ షేరు ధర గరిష్ఠంగా 342.89 డాలర్లకు చేరుకోవడంతో కంపెనీ మార్కెట్ విలువ 5.036 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి షేరు ధర స్వల్పంగా తగ్గడంతో మార్కెట్ క్యాప్ మళ్లీ 5 ట్రిలియన్ డాలర్ల దిగువకు చేరింది. 2026లో ఇప్పటివరకు యాపిల్ షేరు సుమారు 25 శాతం పెరిగింది. ఇతర టెక్ సంస్థల మాదిరిగా ఏఐపై భారీగా ఖర్చు చేయకుండా, లాభదాయకతను కొనసాగించడం, వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టడం కంపెనీకి కలిసొచ్చిన అంశాలుగా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!