

ఇండియా టుడే డేటా ప్రకారం దేశంలోని ఆరు జాతీయ రాజకీయ పార్టీలకు 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 7,960.09 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో అత్యధికంగా 85.03 శాతం వాటా భాజపా ఖాతాలోకే వెళ్లినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది. ఎన్నికల సంఘానికి ఆయా పార్టీలు సమర్పించిన ఆడిట్ నివేదికల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు. అదే సమయంలో కాంగ్రెస్ రూ. 918.28 కోట్ల ఆదాయంతో రెండో స్థానంలో నిలిచింది. సీపీఎం రూ. 172.60 కోట్లు, బీఎస్పీ రూ. 58.58 కోట్లు, ఆప్ రూ. 39.28 కోట్లు, నేషనల్ పీపుల్స్ పార్టీ రూ. 2.18 కోట్ల ఆదాయం నమోదు చేశాయి.
ఇక పార్టీ ఖర్చుల విషయంలో కూడా ఆసక్తికర గణాంకాలు బయటపడ్డాయి. భాజపా తన ఆదాయంలో 55.76 శాతం మేర ఖర్చు చేయగా, కాంగ్రెస్ మొత్తం ఆదాయాన్ని మించి ఖర్చు చేసింది. బీఎస్పీ కూడా తనకు వచ్చిన ఆదాయాన్ని మించి వ్యయం చేసింది. మరోవైపు ఆరు జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 85.08 శాతం విరాళాల రూపంలోనే వచ్చిందని నివేదిక తెలిపింది. భాజపా, కాంగ్రెస్, సీపీఎం, ఆప్, ఎన్సీపీలు విరాళాల ద్వారా భారీ మొత్తాలను పొందగా, బీఎస్పీ మాత్రం తన ఆదాయం మొత్తం ఇతర మార్గాల ద్వారా వచ్చినదని వెల్లడించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!