

రాష్ట్ర పోలీసు శాఖలో ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన సుమారు 7,400 ఖాళీల భర్తీ ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నియామకాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను నాలుగు వారాల్లో అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది. పోలీసు శాఖలో భారీగా ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదని హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ తరఫున హాజరైన స్పెషల్ జీపీ రాహుల్, ఇప్పటికే 5,000 పోస్టుల నియామక ప్రక్రియ ప్రారంభమైందని కోర్టుకు తెలిపారు.
ఇదిలా ఉండగా, 2022 తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నియామకాలలో మిగిలిన సుమారు 400 పోస్టుల భర్తీ వివాదంపై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 8న తుది విచారణ చేపట్టనుంది. జిల్లాల వారీగా వేర్వేరు కటాఫ్ మార్కులు నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం, ఇది ఆర్టికల్ 371(డి) వ్యాఖ్యానానికి సంబంధించిన సంక్లిష్ట న్యాయపరమైన అంశమని పేర్కొంది. అలాగే, ఇదే కేసుకు సంబంధించి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కోర్టు ధిక్కరణ కేసులో తదుపరి చర్యలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!