

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఒక కేసు వెలుగులోకి రాగా, తాజాగా ఎనిమిది మందికి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యాధికారులు తెలిపారు. గోపాలపురానికి చెందిన 25 ఏళ్ల మహిళ ప్రసవానంతరం జ్వరం, జలుబు తగ్గకపోవడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతం ఆమెను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
అలాగే రాజమహేంద్రవరం గ్రామీణంలోని కొంతమూరుకు చెందిన 54 ఏళ్ల మహిళకు దగ్గు తగ్గకపోవడంతో పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెకు తీవ్ర లక్షణాలు లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ప్రజలు మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!