
జనరల్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 26న (ఆదివారం) ఆయన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12:45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కరీంనగర్‌కు బయలుదేరి, నగునూరు రోడ్డులోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చేరుకుంటారు.
మధ్యాహ్న భోజనం అనంతరం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3:45 గంటల వరకు ప్రతిమ మెడికల్ కాలేజీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన అనంతరం హెలికాప్టర్లో సాయంత్రం 4:55 గంటలకు బేగంపేటకు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!