

హైదరాబాద్ బల్కంపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం రేణుకా ఎల్లమ్మ–జమదగ్ని మహర్షుల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 11:51 గంటలకు ఉత్తరా నక్షత్రయుక్త అభిజిత్ లగ్నంలో వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కళకళలాడాయి.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీత కూడా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!