

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశం వైపు ఆర్థిక తుపాను ముంచుకొస్తోందని హెచ్చరించారు. తన నియోజకవర్గంలోని బఛ్రావాలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు పొదుపు చర్యలు పాటించాలని సూచిస్తూ తానే విదేశీ పర్యటనలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం మారేంతవరకు ద్రవ్యోల్బణం తగ్గదని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు, ఎరువుల కొరత తలెత్తే ప్రమాదం ఉందని, దీని ప్రభావం సాధారణ ప్రజలపై తీవ్రంగా పడుతుందని హెచ్చరించారు.
ఈ సంక్షోభం రైతులు, యువత, చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని రాహుల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెట్రోల్ ధరలు పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నారని, కొందరు పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక విధానాల్లో ప్రభుత్వం విఫలమైందని, ముందుచూపు లోపించిందని ఖర్గే వ్యాఖ్యానించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!