

నటసింహం నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం NBK111 షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో మెగా హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న 'సంబరాల యేటి గట్టు' సినిమా షూటింగ్ సమీపంలోని సెట్స్‌లో జరుగుతోందని తెలుసుకుని స్వయంగా అక్కడికి వెళ్లి చిత్ర బృందానికి అనుకోని సర్‌ప్రైజ్ ఇచ్చారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 షూటింగ్ మధ్యలో జరిగిన ఈ సందర్శనతో చిత్ర యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
సెట్స్‌లో సాయి దుర్గ తేజ్‌ను ఆప్యాయంగా పలకరించిన బాలకృష్ణ, దర్శకుడు, నిర్మాతలతో కాసేపు ముచ్చటించారు. ఆర్ట్ డైరెక్టర్ రూపొందించిన భారీ సెట్స్‌ను పరిశీలించి, సినిమా నిర్మాణ విలువలు ఎంతో గ్రాండ్‌గా ఉన్నాయని ప్రశంసించారు. చిత్ర బృందం చూపిస్తున్న అంకితభావాన్ని అభినందిస్తూ, గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామా ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలయ్య ఆకస్మిక రాకతో షూటింగ్ స్పాట్ సందడిగా మారగా, ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!