
జనరల్

యూఏపీఏ చట్టం వినియోగంపై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిని యూఏపీఏ కింద రిమాండ్‌కు పంపించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. "యువరాజును ప్రశ్నిస్తే అది దేశద్రోహమా?" అంటూ ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును అణచివేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.
ప్రశ్నించే గొంతులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని, బాధితుడితో పాటు అతనికి మద్దతు తెలిపే వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఉద్దేశించి "మీతో ఆట మొదలైంది... కానీ ఈ ఆటకు ముగింపు ప్రజలే ఇస్తారు... గేమ్ ఆన్" అంటూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!