
జనరల్

ఈజిప్ట్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా చేత 3-2 తేడాతో ఎదురైన ఓటమి అనంతరం రిఫరీ నిర్ణయాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మ్యాచ్‌లో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఫలితాన్ని ప్రభావితం చేశాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఫిఫాకు అధికారికంగా ఫిర్యాదు చేసింది.
రిఫరీ తీర్పులు నిష్పక్షపాతంగా లేవని పేర్కొన్న ఈజిప్ట్ ఫుట్‌బాల్ అసోసియేషన్, సంబంధిత రిఫరీని మిగిలిన ప్రపంచకప్ మ్యాచ్‌లకు నియమించకూడదని ఫిఫాను కోరింది. ఈ ఫిర్యాదుపై ఫిఫా ఎలా స్పందిస్తుందనే అంశంపై ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!