
రాజకీయాలు

విజయవాడకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్ మంగళవారం సాయంత్రం అధికారికంగా జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి పార్టీలో చేరాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆయనను పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గుడిపాటి సీతారామ్‌తో పాటు ఆయన సతీమణి, యువ గాయని శ్రీలలిత కూడా పాల్గొన్నారు. "నేషన్ ఫస్ట్" అనే దృక్పథంతో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పంతోనే జనసేనలో చేరానని సీతారామ్ తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజా సేవలో భాగస్వామి అవుతానని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!