

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ వ్యవహారాలు) రాకేష్ స్వామి, గోద్రెజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణతో పాటు ఖమ్మం జిల్లాలో రూ.300 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తొలి ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటు ప్రణాళికలను కంపెనీ ముఖ్యమంత్రికి వివరించింది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా 700 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్, నర్సరీ, ఆర్ అండ్ డి కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటుకు ఇప్పటికే భూమి కేటాయించగా, సీడ్ గార్డెన్ కోసం అదనపు భూమి, ప్రాసెసింగ్ మిల్‌కు వెళ్లే రహదారి విస్తరణను కంపెనీ కోరింది. దీనిపై టీజీఐఐసీ ఆధ్వర్యంలో రహదారి విస్తరణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!