
జనరల్

కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దాదాపు రెండు నెలల తర్వాత డీకే శివకుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఢిల్లీలో జరిగిన చర్చల అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం కొత్త మంత్రుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 20 స్థానాల్లో 19 మందికి మంత్రి పదవులు లభించాయి. అయితే ఈసారి కూడా మంత్రివర్గంలో ఒక్క మహిళకూ అవకాశం ఇవ్వకపోవడం రాజకీయ చర్చకు దారి తీసింది.
లోక్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రకటించిన జాబితాలో మార్పులు చోటుచేసుకుని ఎస్.ఎస్. మల్లికార్జున ప్రమాణం చేయగా, గాయత్రి శాంతేగౌడ ప్రమాణం చేయలేదు. దీంతో కేబినెట్ మొత్తం సభ్యుల సంఖ్య సీఎంతో కలిపి 33కి చేరింది. సీనియర్లకు అవకాశం రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓర్పుతో ఉంటే అవకాశాలు వస్తాయని డీకే శివకుమార్ సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!