

డిజిటల్ చెల్లింపుల్లో కీలకమైన యూపీఐ లావాదేవీలపై ఎలాంటి రుసుములు విధించే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రూ.3,000 దాటిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ విధించనున్నారన్న వార్తలను ఖండించింది. పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం 2007లోని సెక్షన్ 10ఏ ప్రకారం యూపీఐ ద్వారా చేసే చెల్లింపులకు బ్యాంకులు, సేవా సంస్థలు ఎలాంటి రుసుములు వసూలు చేయరాదు. సీబీడీటీ నోటిఫికేషన్ ప్రకారం భీమ్ యూపీఐ, యూపీఐ క్యూ ఆర్, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ సున్నాగా నిర్ణయించారు.
అయితే కొన్ని ప్రత్యేక లావాదేవీలకు వేర్వేరు నిబంధనలు వర్తిస్తాయి. వాలెట్ల ద్వారా యూపీఐతో చేసే రూ.2,000 పైబడిన వర్తక లావాదేవీలపై గరిష్ఠంగా 1.1 శాతం ఇంటర్‌చేంజ్ రుసుము ఉండవచ్చు. అలాగే యూపీఐతో అనుసంధానించిన రూపే క్రెడిట్ కార్డు చెల్లింపులకు సాధారణ క్రెడిట్ కార్డు ఎండీఆర్ వర్తిస్తుంది. అయినప్పటికీ సాధారణ యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!