
రాజకీయాలు

బిహార్‌లోని బాంకీపుర్ శాసనసభ ఉపఎన్నికలో భాజపా ఓటమి దేశ రాజకీయాల్లో కీలక మార్పుకు సంకేతమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భాజపా కంచుకోటగా భావించే ఈ నియోజకవర్గంలో, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సొంత ప్రాంతంలో జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ విజయం సాధించడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఉపఎన్నిక ఫలితాలపై సోమవారం స్పందించిన వారు, అహంకార ధోరణితో వ్యవహరిస్తున్న భాజపాకు ప్రజలు గుణపాఠం చెప్పారని విమర్శించారు. ఈ ఫలితాలు ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!