
రాజకీయాలు

హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ భారాస మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. ఉద్యోగం ఇప్పిస్తానని, ఛానల్ ఏర్పాటు చేస్తానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డారని, రూ.5 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఓ యువతి చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు అయ్యింది. ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ కాంతారావు పిటిషన్ దాఖలు చేశారు.
తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా తప్పుడు అని, రాజకీయంగా మరియు వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఈ ఫిర్యాదు చేశారని ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్ల క్రితం జరిగినట్లు చెప్పిన ఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం చట్టవిరుద్ధమని, కేసును కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 5న జస్టిస్ బి.ఆర్. మధుసూదన్ రావు విచారణ చేపట్టే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!