

నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. తీవ్రమైన నేర చరిత్ర ఉన్న విద్యార్థుల విడుదలను మాత్రమే తాము వ్యతిరేకించామని, మిగిలిన కేసులను చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు మూసివేయడం లేదా ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవచ్చని ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసులపై కఠిన వైఖరి లేదని వెల్లడించిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ హేయమైన నేరాల్లో ప్రమేయం ఉన్న సుమారు 2,700 మంది కేసులను ఉపసంహరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు. విచక్షణారహితంగా బలప్రయోగం చేసిన పోలీసులకు రక్షణ కల్పించరాదని, అలాగే కరడుగట్టిన నేరస్తులు విద్యార్థుల పేరుతో తప్పించుకోకూడదని సీజేఐ వ్యాఖ్యానించారు. తదుపరి విచారణ ఈ నెల 18న జరగనుంది. సుప్రీం స్పష్టతపై కాక్రోచ్ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!