

కాక్రోచ్ జనతా పార్టీ (సీజీపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. విద్యార్థులతో సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ చేస్తున్న సంభాషణలను ప్రస్తావిస్తూ, ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా బాగా పనిచేస్తున్నారని, దేశ పాలనను మరొకరికి అప్పగించాలని అన్నారు.
సీజీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల అనంతరం కూడా కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులను వేధిస్తున్నారని అభిజిత్ దీప్కే ఆరోపించారు. విద్యార్థులపై చర్యలు నిలిపివేయాలని, లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్పందిస్తారని హెచ్చరించారు. ప్రజల అసంతృప్తి వ్యక్తులపై కాకుండా ప్రభుత్వ విధానాలపై ఉందని పేర్కొన్నారు. జంతర్ మంతర్ నిరసనల్లో విద్యార్థులపై పెల్లెట్ గన్ వినియోగానికి ఆదేశాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!