
ఆరోగ్యం

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ అయింది. ఈనెల 23 లోగా వివరణ ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ ఆదేశించింది. గత శీతాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రేణుకా చౌదరి తన కారులో పెంపుడు కుక్కను పార్లమెంట్ ప్రాంగణానికి తీసుకురావడం వివాదాస్పదమైంది. కొందరు ఎంపీలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా “లోపల కూర్చున్నవారే కరుస్తారు, కుక్కలు కరవవు” అని వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ఎంపీలు బ్రిజ్ లాల్, ఇందు బాలా గోస్వామి లు ఫిర్యాదు చేయడంతో, ఎంపీలను అవమానించేలా మాట్లాడినట్లు ఆరోపిస్తూ రేణుకా చౌదరికి నోటీసు జారీ చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!