

పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్ల భారాస పాలనలో రాష్ట్ర ప్రజలపై రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం పడిందని, అదే సమయంలో కే. చంద్రశేఖర్ రావు కుటుంబ ఆస్తులు మాత్రం వేల కోట్ల రూపాయల మేర పెరిగాయని ఆరోపించారు. ఇది ఎలా సాధ్యమైందో వివరించాలని కే. తారక రామారావును ప్రశ్నించారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బుతోనే టీఆర్‌ఎస్‌ను భారాసగా మార్చారని కూడా ఆరోపించారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో చేసిన పోస్టులో పొంగులేటి, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడకుండా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. భారాసను 'ఫామ్‌హౌస్ రాష్ట్ర సమితి'గా మార్చుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రజల మద్దతు పొందుతుందని, మరోసారి భారాస ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!