

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం మరోసారి ప్రధాన రాజకీయ అంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తి కోసం జూన్‌లో పాదయాత్ర చేపట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.
డిండి ఎత్తిపోతల పథకం వల్ల జిల్లాకు నష్టం జరుగుతుందని జలసాధన కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పథకాన్ని రద్దు చేసి గొట్టిముక్కల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ బీసీ రాజకీయ సమితి విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేసింది.
అయితే డిసెంబర్ 2027 నాటికి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు పెండింగ్ ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. కానీ రెండున్నరేళ్లుగా ముందుకు సాగని పనులు మిగిలిన రెండేళ్లలో ఎలా పూర్తవుతాయన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!