

కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరెస్సెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వారిని ‘ద్రోహులు’గా అభివర్ణించారు. రాయ్‌బరేలీ, అమేఠీలలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంపై దాడులు జరుగుతున్నాయని, దేశ ప్రయోజనాలను కొంతమంది పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు దీనికి ఎదురు నిలవాలని పిలుపునిచ్చారు.
ఇదే విషయంపై బీజేపీ తీవ్రంగా ప్రతిస్పందించింది. దేశ నాయకులను ద్రోహులుగా పేర్కొనడం ద్వారా 140 కోట్ల భారతీయులను అవమానించారని పార్టీ నేతలు విమర్శించారు. రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ అసహనం కారణంగా వచ్చినవని, దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామంతో రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!