

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మెల్‌బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో నిర్వహించిన ప్రవాస భారతీయుల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ, మోదీ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచారని, ఆయన నాయకత్వంలో భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రశంసించారు. అలాగే మోదీ తన ఆప్తమిత్రుడని పేర్కొంటూ, భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలపడుతున్నాయని అన్నారు.
ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ, మెల్‌బోర్న్‌లో లభించిన ఘన స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు. 2014, 2023 తర్వాత మూడోసారి ఆస్ట్రేలియా రావడం ఆనందంగా ఉందని, ఇది తనకు హ్యాట్రిక్ పర్యటన అని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఉండగా, మెల్‌బోర్న్ ప్రపంచ ప్రఖ్యాత ఐకానిక్ స్టేడియంగా నిలిచిందన్నారు. ఈ సభ హౌస్‌ఫుల్ బ్లాక్‌బస్టర్‌లా విజయవంతమైందని వ్యాఖ్యానించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!