
జనరల్

పోలవరం ప్రాజెక్టు అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం ముదురుతోంది. పోలవరం ఫేజ్-2 పనులపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వెంటనే నిర్మాణ పనులను నిలిపివేయాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA)కి లేఖ రాసింది.
ముంపు ప్రాంతాలపై పూర్తి స్థాయి సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని తెలంగాణ స్పష్టం చేసింది. ముఖ్యంగా భద్రాచలం సహా ప్రభావిత ప్రాంతాలపై ఆందోళన వ్యక్తం చేసింది. 36 వాగుల డ్రైనేజ్ ప్రభావంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని డిమాండ్ చేసింది. పోలవరం లిఫ్ట్ స్కీమ్ పునఃప్రారంభంపై కూడా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏపీ పనులు చేపడుతోందని ఆరోపించింది. వెంటనే పనులను నిలిపివేయాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పీపీఏను తెలంగాణ ప్రభుత్వం కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!