
గాసిప్స్

నేడు విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం జరగనుంది. సాయంత్రం 4:30 గంటలకు ఈ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో భారత్ – అమెరికా, భారత్ – యూరోపియన్ యూనియన్ మధ్య కుదురుతున్న వాణిజ్య, సహకార ఒప్పందాలపై విస్తృతంగా చర్చ జరగనుంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఒప్పందాల ప్రాధాన్యతపై సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేయనున్నారు.
అలాగే భారత్ – బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలపై కూడా కమిటీ చర్చించనుంది. సరిహద్దు భద్రత, వాణిజ్యం, ప్రాంతీయ సహకారం, తాజా దౌత్య పరిణామాలపై సమీక్ష చేపట్టే అవకాశం ఉంది. దక్షిణాసియా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!