
సినిమాలు

తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడిగా సీనియర్ నేత, ఎంపీ బీ మాణిక్కం ఠాగూర్ నియమితులయ్యారు. ఠాగూర్ నియమాకానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆమోదం తెలిపారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలను చూస్తున్న మాణిక్కంకు దక్షిణాది రాజకీయాలపై పట్టు ఉంది. గతంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఆయన ఉన్న సమయంలోనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితులయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!