

తాడేపల్లిలో మంత్రి నారా లోకేశ్ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. జగన్ నివాసానికి సుమారు 200 మీటర్ల దూరంలో నిలబడి మాట్లాడుతున్నానని పేర్కొన్న ఆయన, డీఎస్సీ నియామకాలపై ఎలాంటి సందేహాలున్నా సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఆరోపణలు చేసి వెళ్లిపోయే రాజకీయాలు తమవి కావని, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని ప్రతిపక్ష నేతలకు సవాల్ చేశారు.
డీఎస్సీ నియామకాలను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేసిన లోకేశ్, రాష్ట్ర ప్రభుత్వం నిజమైన జాబ్ క్యాలెండర్ అమలు చేస్తోందన్నారు. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని జగన్పై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ఆరోపించిన ఆయన, మహిళలను అవమానించే వారిపై తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రతిపక్షం దృష్టి సారించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!