
బిజినెస్

ఇటీవల మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌కు గురైన కొండా సురేఖ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆమె హాజరు కాలేదు. మంత్రి పదవి కోల్పోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా కొనసాగుతానని సురేఖ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఆమె అసెంబ్లీకి దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ అసెంబ్లీ సెషన్ మొత్తం సమావేశాలకు దూరంగా ఉండాలని కొండా సురేఖ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి నుంచి ఆమెను తొలగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సురేఖ నిజంగానే మొత్తం సమావేశాలకు హాజరు కాకుండా ఉంటారా, తదుపరి రోజుల్లో అసెంబ్లీకి వస్తారా అనే విషయంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!