
ఆరోగ్యం

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. 22ఏ భూముల అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో చోటుచేసుకున్న భూ దందాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ బీజేపీ సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు.
బీజేపీ ఎమ్మెల్యేల నిరసనతో అసెంబ్లీలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సభ్యులు తమ డిమాండ్లపై పట్టుబడుతూ ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!