

దేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలపై నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారం చేయడం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. చట్టపరమైన వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే కేంద్ర ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అనుమానాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫారం-6కు సంబంధించి రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం ‘తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి’ అని పేర్కొంటూ వివరణ ఇచ్చింది. అయితే, ఫారం-6 మార్పులపై సుప్రీంకోర్టు కూడా ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో ఈ అంశంపై రాజకీయ వివాదం కొనసాగుతోంది.
రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడల్లా రాహుల్‌గాంధీ ఏదో ఒక వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో చేసిన ఆరోపణలకు సంబంధించి ఆయన సుప్రీంకోర్టుకు క్షమాపణ పత్రం సమర్పించాల్సి వచ్చిందని, మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కేసులోనూ న్యాయపరమైన పరిణామాలను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ‘సర్’పై నిరాధార ఆరోపణలు, తాజాగా ఫారం-6 అంశంపై ప్రచారం చేయడం కాంగ్రెస్ రాజకీయ ధోరణిలో భాగమేనని కిషన్‌రెడ్డి విమర్శించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!