
షోస్

ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2018లో నమోదైన పరువు నష్టం కేసుకు సంబంధించి ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ అయింది. సోమవారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనమ్ రైస్ ఖాన్ ఈ వారెంట్‌ను జారీ చేసినట్లు సమాచారం. ధ్రువ్ రాఠీ తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన ఓ వీడియోకు సంబంధించి ఈ కేసు నమోదైంది.
వికాస్ సంస్కృతాయన్ అలియాస్ వికాస్ పాండే ధ్రువ్ రాఠీపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై ధ్రువ్ రాఠీ స్పందనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!