

తెలంగాణలోని కరీంనగర్‌లో భాజపా నిర్వహించిన మహాపాదయాత్రలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ, ఈ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భాజపా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నితిన్ నబీన్ పాల్గొనడంతో మహాపాదయాత్రకు ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ మహాపాదయాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు ఇతర భాజపా నాయకులు కూడా పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ఆవశ్యకతను ప్రజలకు వివరించిన నాయకులు.. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని గాంధీ చౌక్ నుంచి కమాన్ చౌరస్తా వరకు పాదయాత్ర కొనసాగింది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!