
గాసిప్స్

గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితుడు ఇర్ఫాన్ సిరాజ్ పడాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత 17 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్న ఆయన గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గోద్రా రైలు దహనం కేసులో శిక్ష అనుభవిస్తున్న పలువురు నిందితులకు సుప్రీంకోర్టు గతంలోనే బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఇర్ఫాన్ సిరాజ్ పడాకు కూడా బెయిల్ లభించడంతో ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లయింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!